ఆమీర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఓ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నారా? తమిళంలో హిట్ అయిన లవ్ టుడే బాలీవుడ్ స్క్రిప్ట్ ఆమీర్‌ఖాన్ కోసం సిద్ధమవుతోందా? ఇప్పుడు నార్త్ లో హాట్ టాపిక్ ఇదే. ఫాంటమ్ పిల్మ్స్, సృష్టి ఆర్య కలిసి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా ఆమీర్ కుమారుడు జునైద్ ఫిక్స్ అయ్యారు. జునైద్‌కి ఇటీవల స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చారట మేకర్స్. త్వరలోనే అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తారట. అంతకు ముందు జరగాల్సిన అన్నీ కార్యక్రమాలను ఫైనలైజ్ చేస్తున్నారు. అర్చన కల్పాతి ఈ సినిమా హిందీ రీమేక్ గురించి ట్విట్టర్‌లో రాశారు. ఫాంటమ్ ఫిల్మ్స్, సృష్టి ఆర్య తో కలిసి ఈ సినిమాను బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.
జునైద్ ఖాన్ ఆల్రెడీ యష్‌రాజ్ ఫిల్మ్స్ మూవీలో నటించారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. మహారాజా అనే టైటిల్‌తో తెరకెక్కిన ఆ సినిమా 1862 మహరాజా లయబుల్ కేస్ ఆధారంగా తెరకెక్కింది. శర్వారి వాఘ్, శాలిని పాండే, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ పి మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లాక్‌డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు జునైద్ ఖాన్ నటిస్తారని అంటున్న లవ్ టుడే తమిళ సినిమా. ప్రదీప్ రంగనాథన్, ఇవానా కలిసి నటించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు వాళ్ల ఫోన్లను ఎక్సేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ఎవరి ఫోన్‌లో ఏం ఉంది? అనే అంశాలతో తెరకెక్కింది ఈ సినిమా. ఈ లవ్ స్టోరీని 2022లో విడుదల చేశారు. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసింది. రవీనా రవి, అక్షయ ఉదయకుమార్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఆమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా పెద్దగా ఆడలేదు. సుభాష్ కపూర్ నెక్స్ట్ సినిమా మొఘల్‌లో నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుల్షన్ కుమార్ బయోపిక్‌లోనూ ఆమీర్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది.